భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
హైదరాబాద్ నవంబర్ 26 (ప్రజాక్షేత్రం):కార్తీక మాసం శుభప్రదం. శుభకార్యాలు, మంచి పనులు చేస్తుంటారు. బంగారం కొనుగోలుపై మహిళలు ఆసక్తి చూపిస్తారు. గత కొన్నిరోజులుగా బంగారం, వెండి ధరలు పెరగుతూ తగ్గుతున్నాయి. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారంపై రూ.వెయ్యి వరకు తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు చేసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,990గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.78,540గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో ధరలు ఇదే విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,140గా ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.78690గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990 ఉంది. మేలిమి బంగారం ధర రూ.78,540గా ఉంది.
చెన్నై, బెంగళూర్‌లో ఇలా..
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.78,540 ఉంది. బెంగళూర్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990 ఉండగా, మేలిమి బంగారం ధర రూ. 78,540 ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.78,540 ఉంది. కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990 ఉంది. మేలిమి బంగారం ధర రూ.78,540గా ఉంది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర రూ.91,400గా ఉంది.