టిటిడి మాజీ సభ్యుడిని కలిసిన మరకత శివాలయ ఆల్ ఇండియా చైర్మన్ దయాకర్ స్వామి
శంకర్ పల్లి నవంబర్ 27(ప్రజాక్షేత్రం):యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్, టిటిడి మాజీ సభ్యుడు కే శివకుమార్ ని బుధవారం మరకత శివాలయ ఆల్ ఇండియా చైర్మన్ దయాకర స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కే శివకుమార్ అందించబోయే స్వామికి స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసే లడ్డూల, నిత్యం అందించే కైంకర్యం ప్రజెంటేషన్ ను ఆయన దయాకర్ స్వామి చేతుల మీదుగా అందుకని తిరుమల బయలుదేరుతున్నారు. శివుని ఆశీస్సులతో కే శివ కుమార్ సంకల్పం నెరవేరుతుందని దయాకర్ స్వామి తెలిపారు.