ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి కుమార్తె రుత్విక రెడ్డి – అభిజిత్ రెడ్డి గార్ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన MRPS అధినేత మంద కృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులైన జగదీశ్వర్ రెడ్డి కుమార్తె రుత్విక రెడ్డి – అభిజిత్ రెడ్డి గార్ల వివాహం శంషాబాద్ విమానాశ్రయంలోని GMR అరినా హాల్ లో జరిగింది.ఈ వివాహానికి MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ గారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో MRPS రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ ,MSP తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాదిగ మరియు రంగారెడ్డి జిల్లా MRPS MSP అద్యక్షులు పెంటనోళ్ళ నరసింహా మాదిగ, రావుగాళ్ల బాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు.