ఇకపై 100 మార్కులకు పదో తరగతి పరీక్షలు
హైదరాబాద్ నవంబర్ 28(ప్రజాక్షేత్రం):తెలంగాణ పదో తరగతి పరీక్షల విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష విధానంలో స్వల్ప మార్పులు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 100 మార్కులకు(ఒక్కో పేపర్‌కు) పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ విధానం 2024-25 విద్యాసంవత్సరం నుంచి అమలు కానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న ఇంటర్నల్ మార్కులను ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇంటర్నల్ మార్కులు 20, వార్షిక పరీక్షల మార్కులు 80గా ఉన్నాయి. ఇకపై విద్యార్థులకు 24 పేజీల బుక్ లెట్ ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ నిర్ణయించింది.