Praja Kshetram
తెలంగాణ

వెల్లివిరిసిన మ‌త‌సామ‌ర‌స్యం.. అయ్యప్ప మాలధారులకు ముస్లింల భిక్ష

వెల్లివిరిసిన మ‌త‌సామ‌ర‌స్యం.. అయ్యప్ప మాలధారులకు ముస్లింల భిక్ష

 

చొప్పదండి నవంబర్ 28(ప్రజాక్షేత్రం): కరీంనగర్‌ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర మణికంఠ ఆలయంలో అయ్యప్ప మాలధారులకు ముస్లింలు భిక్ష ఏర్పాటు చేసి మతసామరస్యం చాటుకున్నారు. కరీంనగర్‌లోని ధరూల్‌ ఖైల్‌ సొసైటీ సభ్యులు సుమారు 150 మంది అయ్యప్ప మాలధారులకు గురువారం భిక్ష ఏర్పాటు చేశారు. గత ఆరేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నుట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. ముస్లింల భిక్ష‌తో ఆ ప్రాంతంలో మ‌త సామ‌ర‌స్యం వెల్లివిరిసింది.

Related posts