Praja Kshetram
తెలంగాణ

వెలవెలబోయిన ఫూలే దంపతుల విగ్రహాలు..

వెలవెలబోయిన ఫూలే దంపతుల విగ్రహాలు..

 

– వర్థంతిని విస్మరించిన మండల నాయకులు

బెజ్జంకి నవంబర్ 28(ప్రజాక్షేత్రం): అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు ఫూలే దంపతుల విగ్రహాలు మండల కేంద్రంలో గురువారం వెలవెలబోయాయి. మండలంలోని అధికార, ప్రతిపక్ష, ప్రజాసంఘాల నాయకులు ప్రతియేటా ఫూలే దంపతుల జయంతి,వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించేవారు. జ్యోతిరావు ఫూలే వర్థంతిని మండలంలోని నాయకులు విస్మరించడంతో చర్చనీయాంశంగా మారింది.జ్యోతిరావు ఫూలే దంపతుల చేసిన కృషిని కొనసాగించడానికి ఇన్నాళ్లు మండలంలోని నాయకులు జయంతి,వర్థంతి వేడుకలను నిర్వహించారా?లేకా హంగుఅర్భాలకు నిర్వహించారానే సందేహాలు ప్రజల్లో తలెత్తాయి. ఇకనైనా మహానీయుల కృషి,త్యాగాలను నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకోవడం మానుకోవాలని పలువురు సూచించారు.

Related posts