Praja Kshetram
తెలంగాణ

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన విద్య కమిషన్ చైర్మన్,కలెక్టర్.

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన విద్య కమిషన్ చైర్మన్,కలెక్టర్.

 

-ఆడపిల్లలు అధైర్య పడొద్దు మగ పిల్లల కంటే ఎందులోనూ తక్కువ కాదు.

-రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి.

కొండాపూర్ నవంబర్ 28(ప్రజాక్షేత్రం):జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తో కలిసి వసతి సంక్షేమ వసతి గృహాలు, కేజీబీవీ పాఠశాలలు, సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన, విద్యా కమిషన్ చైర్మన్, కలెక్టర్లు. ఆడపిల్లలు అధైర్య పడద్దని ఆడపిల్లలు మగవారి పిల్లల కంటే ఎందులోనూ తీసిపోరని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆకులూరి మురళి అన్నారు. గురువారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా, మండల కేంద్రమైన కొండాపూర్ లోని కేజీబీవీ పాఠశాలను, కొండాపూర్ మండలం మల్లెపల్లి లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని, సంగారెడ్డి హాస్టల్ గడ్డలోని ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ ను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తో కలిసి తనిఖీ చేశారు ఈ సందర్భంగా సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ లో కలెక్టర్ , విద్యా కమిషన్ చైర్మన్లు విద్యార్థులతో కలిసి రాత్రి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు కస్తూరిబా పాఠశాల సాంఘిక సంక్షేమ వసతి గృహాలు ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ లలో వంట గదులు, స్టోర్ రూమ్ లు, డైనింగ్ హాలు, మూత్రశాలలో మరుగుదొడ్లు, గదులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం నేను ప్రకారం పెట్టాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కస్తూరిబా బాలికల పాఠశాలలో విద్యార్థులతో విద్యా కమిషన్ చైర్మన్ మాట్లాడారు ధైర్యం చెందొద్దని పోటీపడి అనుకున్నది సాధించాలని,ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యాన్ని సాధించేవరకు విద్యపై దృష్టి సారించాలని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉన్నత పదవుల్లో ఉన్న ఎంతోమంది అధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే అన్నారు. సంక్షేమ వసతి గృహాలు ,సంక్షేమ గురుకుల పాఠశాలలో కేజీబీవీబీలలో భోజనాల తయారీ కోసం వినియోగించే కారంపొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, గరం మసాలా, సాంబార్ పౌడర్ లాంటి పొడులను రెడీమేడ్ వి వాడవద్దన్నారు. ఇక్కడే తయారు చేసుకోవాలని సూచించారు. పది రోజులపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సంక్షేమ వసతిగృహాలు, కేజీబీవీ పాఠశాలలు, సంక్షేమ గురుకుల పాఠశాలలో తనిఖీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ తెలిపారు. చలికాలంను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు వెంటనే బ్లాంకెట్లు , స్వెటర్లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ను విద్యా కమిషన్ చైర్మన్ ఆదేశించారు. సంక్షేమ వసతి గృహాలు సంక్షేమ గురుకుల పాఠశాలలో అవసరమైన మరమత్తు పనులు వెంటనే చేపట్టాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు విద్యార్థి సమస్యలపై ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికను అందజేసి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు విద్య కమిషన్ చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, సంగారెడ్డి తాసిల్దార్ దేవదాస్, వార్డెన్లు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

Related posts