జనవరి 14న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్?
– తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగబోతుంది.
ప్రజాక్షేత్రం, వెబ్ డెస్క్: తెలంగాణలో మరో ఎన్నికల నగారా మోగబోతుంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పంచాయతీ ఎన్నికల కు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 14న తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కు నగారా మోగనున్నట్టు సమాచారం. కాగా ఈ ఎన్నికలను మూడు విడతల్లో జరపనుండగా.. ఫిబ్రవరిలో మొదటి విడత మొదలు కానున్నాయి. ఈసారి ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధనలు ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రిజర్వేషన్లలో మార్పులపై ఇప్పటికే సర్కార్ కసరత్తులు చేస్తుండగా.. డిసెంబర్ లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో వీటికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టె అవకాశాలున్నాయి.