Praja Kshetram
తెలంగాణ

నాగార్జున పిటిషన్‌.. మంత్రి కొండా సురేఖకు సమన్లు

నాగార్జున పిటిషన్‌.. మంత్రి కొండా సురేఖకు సమన్లు

 

– మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది….

ప్రజాక్షేత్రం, వెబ్ డెస్క్: మంత్రి కొండా సురేఖ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆమెను ఆదేశించింది. హీరో నాగార్జునపై మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో నాగార్జున సీరియస్ అయ్యారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను గురువారం మధ్యాహ్నం ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. తమ ఎదుట హాజరైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మంత్రి కొండా సురేఖ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.

Related posts