Praja Kshetram
తెలంగాణ

పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన కేటీఆర్, హరీశ్ రావు

పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన కేటీఆర్, హరీశ్ రావు

 

– ఎదురెదురుగా కూర్చొని భోజనం చేసిన కేటీఆర్, హరీశ్ రావు

– తమకు ఏం కావాలో సర్వర్లను అడిగి తెప్పించుకున్న నేతలు

– సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసిన నేతలు

హైదరాబాద్ నవంబర్ 28 (ప్రజాక్షేత్రం):బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్‌లో కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ ఇద్దరు నేతలు టేబుల్‌పై ఎదురెదురుగా కూర్చొని భోజనం చేశారు. తమకు ఏం కావాలో సర్వర్లను అడిగి మరీ తెప్పించుకున్నారు. సరదాగా మాట్లాడుకుంటూ వారు భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

మూసీ ప్రాజెక్టుపై వాస్తవాలను దాచి పెడుతోంది : హరీశ్ రావు

మూసీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని హరీశ్ రావు విమర్శించారు. అంతకుముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పార్లమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని, ఇది సిగ్గుచేటు విషయమన్నారు. మూసీ ప్రాజెక్టుపై కేంద్రానికి, పార్లమెంట్‌కు ఒకటి చెప్పి… మరొకటి అమలు చేస్తున్నారని విమర్శించారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు పార్లమెంటుకు చెప్పారని, ఇది అవాస్తవమన్నారు.

Related posts