శంకర్‌పల్లిలో ముదిరాజ్ సంఘం భవనాన్ని ప్రారంభించిన చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్
శంకర్ పల్లి నవంబర్ 28 (ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి పట్టణ పరిధిలో గురువారం ముదిరాజ్ సంఘం భవనాన్ని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలో అన్ని సంఘాల అభివృద్ధి కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భీమ్ భరత్ తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి నారాయణ, మాజీ ఎంపిటిసిలు ఎజాస్, మైసయ్య, కౌన్సిలర్ శ్రీనాథ్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్, ఐలయ్య, మహేందర్, వెంకటరెడ్డి, పాండు, మల్లేష్, మండల, మున్సిపల్ ముదిరాజ్ సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.