1150 కిలోమీటర్ల శబరిమల పాదయాత్ర చేసిన శంకర్‌పల్లి అయ్యప్ప స్వాములకు సన్మానం
శంకర్ పల్లి నవంబర్ 28 (ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మున్సిపాలిటీకి చెందిన సాయి భాస్కర్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో 1150 కిలోమీటర్ల శబరిమల పాదయాత్ర పూర్తి చేశారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరిగి గురువారం పట్టణానికి స్వాములు వచ్చారు. ఈ సందర్భంగా స్వాములను మాజీ ఉపసర్పంచ్ దండు సంతోష్ కుమార్, బిజెపి యువనేత కార్తీక్ రెడ్డిలు కలిసి ఘనంగా శాలువాలతో సన్మానించారు. స్వాములు మాట్లాడుతూ ఐదు రాష్ట్రాలు, 175 గ్రామాల మీదుగా, ప్రతి రోజు 30 నుండి 40 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, శబరిమల చేరుకొని, స్వామిని దర్శించుకుని, తిరిగి స్వగృహానికి చేరుకున్నామని ప్రశాంత్, సాయి కిరణ్ రెడ్డి, విక్రాంత్ సింగ్, ప్రేమ్ గౌడ్, యశ్వంత్ రెడ్డి పేర్కొన్నారు.