Praja Kshetram
తెలంగాణ

టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం  

టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం

 

హైదరాబాద్ నవంబర్ 30(ప్రజాక్షేత్రం):తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కొత్త చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి, తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. ప్రస్తుత టీజీపీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3వ తేదీతో ముగియనుండడం గమనార్హం. నవంబర్ 11న తెలంగాణ ప్రభుత్వం టీజీపీఎస్సీకి కొత్త చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో బుర్రా వెంకటేశం స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయనున్నారు. బుర్రా వెంకటేశం నియామక ఫైల్ పై గవర్నర్ సంతకం చేశారు.

Related posts