రేషన్ బియ్యం అమ్మే మరి తల్లిని ఆసుపత్రికి చూపిస్తున్న కొడుకులు
-గల్లీకి ఆటోలు రావని తోపుడు బండిపై తల్లిని ఆసుపత్రికి తీసుకొచ్చిన వైనం
-అమ్మిన రేషన్ బియ్యం డబ్బులతోనే తీసుకొచ్చిన తోపుడు బండికి కూడా కిరాయి కట్టాలి
షాద్ నగర్ డిసెంబర్ 01(ప్రజాక్షేత్రం):ఇది ఎక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపించే సంఘటన కాదు సాక్షాత్తు మన హైదరాబాద్ కి కూతవేటు దూరంలో ఉన్న రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకున్నటువంటి ఘటన వివరాలలోకి వెళితే గౌస్ పాషా, షాజుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులు వారి వృద్ధురాలైన తల్లి అయినటువంటి జిన్నబీ నీ ఆసుపత్రికి తోపుడు బండిపై తీసుకుని వస్తున్న వారిని వివరాలు అడగగా వారు మా కాలనీలోకి ఆటోలు రావని మరియు మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈ తోపుడు బండిని రెంటుకు తీసుకొని దానిపై మా అమ్మని హాస్పిటల్ కి తీసుకొచ్చామని ఇద్దరు కొడుకులు తెలియజేశారు అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే వాళ్లు వాళ్ళ అమ్మని హాస్పిటల్ కు చూపించడానికి డబ్బులు లేక వారి దగ్గర ఉన్న రేషన్ బియ్యాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బులలో కొంత డబ్బును వాళ్ళ అమ్మ వైద్యానికి ఉపయోగించి మిగిలిన డబ్బులు 200 రూపాయలను ఆ తోపుడు బండి తీసుకొచ్చినందుకుగాను కిరాయిగా చెల్లించాలని వారు తెలియజేశారు.