Praja Kshetram
క్రైమ్ న్యూస్

ఎస్పీగా జాయిన్‌ ఇవ్వడానికి వెళ్లే రోజే… మృత్యు ఒడిలోకి

ఎస్పీగా జాయిన్‌ ఇవ్వడానికి వెళ్లే రోజే… మృత్యు ఒడిలోకి

 

హైదరాబాద్ డిసెంబర్ 02 (ప్రజాక్షేత్రం):డ్యూటీలో మొదటి రోజు జాయిన్‌ అవ్వడానికి వెళ్తూ ఓ యువ ఎస్పీ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈఘటన కర్నాటకలోని హసన్‌-మైసూరు రోడ్డుపై చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన హర్ష్‌ బర్ధన్‌ (27) కష్టపడి చదివి ఐపీఎస్‌ అయ్యాడు. కర్ణాటకలోని హోలెనరసిపురలో ప్రొబేషనరీ ఎస్పీగా ఎంపికయ్యాడు. పోస్టింగ్‌ కోసం డ్యూటీలో జాయినవ్వడానికి హోలెనరసిపురకు వెళ్తుండగా, హసన్‌-మైసూరు రోడ్డుపై కారు టైర్‌ పేలి పక్కనే ఉన్న ఇంటిని ఢీకొంది. ఈ ప్రమాదంలో హర్ష్‌ బర్ధన్‌, ఆయన కారు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఇద్దరు మరణించారు.

Related posts