Praja Kshetram
తెలంగాణ

అయ్యప్పకు మహా వైభవ పడిపూజ

అయ్యప్పకు మహా వైభవ పడిపూజ

 

మొయినాబాద్ డిసెంబర్ 07(ప్రజాక్షేత్రం):మండలంలోని  యేన్కేపల్లి అనుబంధ గ్రామం అయిన జీవన్ గూడ గ్రామం లో అయ్యప్ప స్వామి పడిపూజ యేలగని రమేష్ గౌడ్ గురు స్వామి, శ్రీశైలం యాదవ్ గురు స్వామి ఆద్వర్యంలో మహ పడిపూజ ఘనంగ జరిగింది నిర్వాహకులు కుమ్మరి రాము బిఆర్ఎస్ సీనియర్ నాయకులు (మాజీ సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్)  ఎంతో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామినీ ప్రతి ఏటా తన తమ్ముడు కుమ్మరి శ్యామ్ అయ్యప్ప మాల ధారణ వేసిన సందర్బంగా తమ సొంత నివాసంలో మహ పడిపూజ నిర్వహించారు. అయ్యప్ప స్వాముల భక్తీ పాటలతో వచ్చిన భక్తులందరినీ  మైమరపించరు అయ్యప్ప స్వామి క్షేత్రం శబరిమల సన్నిధానంలో ఉండే 18 మెట్లకు విశేష ప్రాధాన్యత ఉంది. దుష్ట శక్తులను సంహరించడానికి అయ్యప్పస్వామి ఉపయోగించిన 18 ఆయుధాలుగా వీటిని పేర్కొంటారు. స్వామి సన్నిధానంలో విగ్రహరూపం దాల్చకముందు ఆ ఆయుధాలను ఒక్కో మెట్టు వద్ద ఉంచారని అంటారు. స్వామి ఆలయానికి చేరుకోవాలంటే 18 కొండలను కూడా దాటాలి. ఆ 18 కొండలను ఈ 18 మెట్లు సూచిస్తాయని కొందరంటారు. 18 మెట్లు 18 పురాణాలను సూచిస్తాయని, రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లో 18 అధ్యాయాలు ఉన్నాయి. భగవద్గీతలోనూ 18 అధ్యాయాలు ఉన్నాయి. ఇలా 18 సంఖ్యకు.అయ్యప్ప సన్నిధిలోని 18 మెట్లకు సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ 18 మెట్లను ఎవరైతే దాటుకుంటూ వెళ్తారో వారికి ‘పుణ్యదర్శనం’ లభిస్తుంది.

Related posts