రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని కలిసిన భీమ్ భరత్
చేవెళ్ల డిసెంబర్ 10 (ప్రజాక్షేత్రం):రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని మంగళవారం చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి భీమ్ భరత్ నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా, ప్రజాపాలన విజయోత్సవాలు విజయవంతంగా జరిగినందుకు గాను మంత్రికి భీమ్ భరత్ శుభాకాంక్షలు తెలిపారు. మొయినాబాద్, శంకర్ పల్లి మండలాల నాయకులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.