ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాలని కోరుతున్నాం
-ఎస్సీ వర్గీకరణ కమిటీ ఏక సభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ ను కలిసిన ఎమ్మార్పీఎస్
-ఎం ఎం పి వికారాబాద్ జిల్లా నాయకులు గుట్టకింది రవి కుమార్ మాదిగ
-ఎమ్మార్పీఎస్ నవాబు పేట మండల ఇన్చార్జి చిట్టిగిద్ద కిష్టయ్య మాదిగ
రంగారెడ్డి డిసెంబర్ 10 (ప్రజాక్షేత్రం):ఎస్సీ వర్గీకరణ కమిటీ ఏక సభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ ను కలిసిన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతిని ఇస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పు ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు. హైదరాబాద్ లో మంగళవారం కమిషన్ చైర్మన్ ను కలుసుకున్నట్టు ఆయన వివరించారు. ఈ సందర్భంగా గుట్టకింద రవి కుమారు మాదిగ, చిట్టిగిద్ద క్రిష్టయ్య.. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు వాటా దక్కేల రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు అయ్యేవరకు ఎలాంటి నియామకాలు గాని నూతనంగా నోటిఫికేషన్లు గానీ ఇవ్వరాదని కోరారు. సరైన ఎంపీరికల్ డాటను సేకరించగలరనీ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. గత 30 సంవత్సరాల నుంచి మాదిగ సమాజం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుల మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని అలుపెరుగని పోరాటాన్ని చేసిన సంగతి తమరి దృష్టికి తీసుకు వస్తున్నామనీ విజ్ఞాపన పతనంలో పేర్కొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఎస్సీ రిజర్వేషన్ల దళితులలోని అన్ని వర్గాలకు అవకాశాలు రావడం లేదు. రిజర్వేషన్లు పొందటంలో వెనుకబడిన మాదిగ,మాదిగ ఉపకులాలు తమ హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయడంలో 1996లో ఏర్పాటు చేసిన జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ పూర్తి వివరాలతో ఎస్సీ వర్గీకరణ న్యాయమైనది అని రిపోర్టు ఇవ్వడం జరిగింది.అప్పుడు నాలుగు సంవత్సరాలు వర్గీకరణ జరిగింది. వర్గీకరణ అమలుతో 2000 నుండి 2004 వరకు వెనకబడిన మాదిగ- ఉపకులాలు లబ్ధి పొందడం జరిగింది. కానీ రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేదని 2004లో సుప్రీంకోర్టు వర్గీకరణ చట్టాన్ని రద్దు చేసింది. ఎమ్మార్పీఎస్ పోరాటంతో 2007లో కేంద్ర ప్రభుత్వ నియమించిన జస్టిస్ ఉషా మెహరా కమిషన్ వర్గీకరణ అమలు చేయాలని సిఫార్సు చేయడం జరిగింది.కానీ 17 సంవత్సరాలుగా అమలు కాలేదు 1950 నుండి 2000 వరకు 2000-2004 వరకు వర్గీకరణ అమలు కాబడిన కాలం మినహాయించి 2000 నుండి 2024 వరకు దళితులలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ,మాదిగ ఉపకులాలు విద్య,ఉద్యోగ, రాజకీయ,సంక్షేమ రంగాల్లో తీవ్రంగా నష్టపోయారు. ఆగస్టు -1- 2024 రోజున ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ న్యాయబద్ధమైనదని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఆయా రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా గౌరవ శ్రీ జస్టిస్ చంద్రచూడు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు 7 గూరితో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పును స్వాగతిస్తూ వెనువెంటనే దేశంలో అమలు చేసే మొదటి రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి తమరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సరైన ఎంపిరికల్ డాటను సేకరించి ఆలస్యం చేయకుండా వెంటనే వర్గీకరణ అమలు చేయవలసిందిగా కోరుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకు వాట దక్కేలా రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలయ్యే వరకు ఎలాంటి నియామకాలు గాని, కొత్త నోటిఫికేషన్లు గానీ ఇవ్వరాదని విజ్ఞప్తి చేస్తున్నాము. తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న మాదిగ మరియు మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసి రిజర్వేషన్ల ఫలాలు అందరికీ న్యాయబద్ధంగా అందేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రంగారెడ్డి జిల్లా కమిటీ నుండి కోరుతున్నాము..