Praja Kshetram
తెలంగాణ

అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు

అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు

-ప్రభుత్వ భూమిలలో అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ చర్యలు తప్పవని చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య అన్నారు.

చేవెళ్ల డిసెంబర్ 10(ప్రజాక్షేత్రం):ప్రభుత్వ భూమిలలో అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ చర్యలు తప్పవని చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య అన్నారు. చేవెళ్ల మండలంలోని గుండాల గ్రామ రెవెన్యూ 153 సర్వే నెంబర్ ఆక్రమణకు గురైన కారణంగా చేవెళ్ల తహసీల్దార్ ప్రభుత్వ భూమిని ఎవరు కబ్జా చేయడానికి వీలు లేదని చెప్పి సర్వేర్ తో సర్వే చేయించి 154 సర్వే నెంబర్ లో ఉన్న వ్యక్తుల నుంచి ఆక్రమణకు గురైన భూమిని జేసీబితో కూల్చివేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఎక్కడ కూడా ప్రభుత్వ భూములును అక్రమంగా ఆక్రమిస్తే క్రిమినల్ చర్యలు చేపడతామనిఅన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ, సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts