ఇబ్రహీంపట్నంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 10 (ప్రజాక్షేత్రం):మాదిగల ఆత్మీయ సమ్మేళనం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం ఎంఆర్పీఎస్ జెఎసి అధ్యక్షుడు బోసుపల్లి ప్రతాప్ మాదిగ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్సీ వర్గీకరణ పోరాట జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… “3 దశాబ్దాల ఉద్యమం. 1994 ఉద్యమం ప్రారంభం అయిన తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా మాలల ఒత్తిడి వల్ల వర్గీకరణ లేకుండా నోటిఫికేషన్ లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న మాలల వత్తిడి వల్ల వర్గీకరణ జరగకుండా అడ్డుకుంది. సుప్రీంకోర్టు తీర్పులో 6 మంది జడ్జిలు ఆర్టికల్ 15, 16 ప్రకారం అందరికీ సమాన ఉద్యోగాలు రావాలి. అందరూ వర్గీకరణ కోసం మరో పోరుకు సిద్ధం కావాలని” అన్నారు.
ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ… “నాయకుడిని కాపాడుకోవాలి, న్యాయని కాపాడుకోవాలి. ఇప్పుడు కాకపోతే మళ్లీ ఎప్పుడు వర్గీకరణ రాని పరిస్థితి ఏర్పడుతుంది. మేధావులు అందరూ మన జాతి కోసం పనిచేయాలి. భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ ఉద్యోగాలు సమానంగా రావాలి. ఎస్సీ లో ఉన్న 59 కులాలు రిజర్వేషన్ జనాభా ప్రాతిపదికంగా పంచుకోవాలని అన్నదమ్ముల ల రిజర్వేషన్ పంచుకొని ముందుకు సాగాలని” అన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్రు ప్రవీణ్ మాదిగ, మంద సురేష్ మాదిగ, పంది కృపేష్, బండిమీద కృష్ణ మాదిగ, మంకాల దాసు, బోడ కృష్ణ, దర్శన్, దోమల పల్లి అంజయ్య, శాగంటి అయోధ్య, కంబాలపల్లి భరత్ కుమార్, మంకు ఇందిర, ఎరప్పుల చంద్రయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.