Praja Kshetram
తెలంగాణ

జగిత్యాల కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత

జగిత్యాల కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత

 

జగిత్యాల డిసెంబర్ 11 (ప్రజాక్షేత్రం):కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులకు అస్వస్థత జగిత్యాల జిల్లా సారంగపూర్‌లోని కస్తూర్బా బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యానికి గురైన విద్యార్థినులను జగిత్యాలలోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కస్తూర్బా బాలికల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగిందా? లేదా మరే కారణంతోనైనా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా, రెండు రోజులుగా చలి తీవ్రత పెరగడంతోనే అనారోగ్యానికి గురై ఉండొచ్చని కస్తూర్బా పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. నిన్న వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ జరిగి 15 మంది ఆస్పత్రిలో చేరారు. ఆ మరుసటి రోజే జగిత్యాల జిల్లాలో విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది.

Related posts