క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది : మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
శంకర్ పల్లి డిసెంబర్ 11 (ప్రజాక్షేత్రం):క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలో నిర్వహించిన సీఎం కప్ -2024 క్రీడ పోటీలు బుధవారం ముగిశాయి. కోకో, వాలీబాల్, కబడ్డీ క్రీడల్లో గెలిచిన వివిధ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు కమిషనర్, వైస్ చైర్మన్ వెంకట్రాంరెడ్డి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారుని విజయం వెనుక బాధాకరమైన కథ ఉంటుంది. క్రీడాకారుని ఓటమి వెనుక బాధాకరమైన ముగింపు ఉంటుందన్నారు. ఆటల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. ప్రతీ క్రీడాకారుడు గెలుపుకోసం మైదానంలో అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ అక్బర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.