Praja Kshetram
తెలంగాణ

శంకర్‌ పల్లి నుంచి శబరిమలకు మూడు ప్రత్యేక రైళ్లు

శంకర్‌ పల్లి నుంచి శబరిమలకు మూడు ప్రత్యేక రైళ్లు

 

శంకర్‌ పల్లి డిసెంబర్ 12(ప్రజాక్షేత్రం):అయ్యప్ప భక్తుల కోసం జనవరి ఫిబ్రవరిలో శబరిమలకు శంకర్‌పల్లి రైల్వే స్టేషన్ నుంచి మూడు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 2025 జనవరి 7, 14, 21, 28 తేదీలలో హైదరాబాద్ – కొట్టాయం (07065), (07135), (07163) 8, 15, 22, 29 తేదీల్లో కొట్టాయం – సికింద్రాబాద్ (07066), (07136), (07164) ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. హైదరాబాద్, బేగంపేట్, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, తాండూర్, సేడం, యాదగిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్, గుత్తి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జొలార్ పెట్టై, సేలం, ఎరోడ్, తిరుపూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిశూర్, అలువ, ఎర్నాకులం, కొట్టాయం స్టేషన్ లలో ఆగుతాయని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

Related posts