Praja Kshetram
తెలంగాణ

ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జనవరి 27 న వెయ్యి గొంతులు – లక్ష డప్పులతో దండోరా ప్రదర్శన…

ఎస్సీ వర్గీకరణ అమలు కోసం జనవరి 27 న వెయ్యి గొంతులు – లక్ష డప్పులతో దండోరా ప్రదర్శన…

-వర్గీకరణ జరిగితే విజయోత్సవ డప్పు – లేదంటే అడ్డుకునే వాళ్లకు చావు డప్పు.

-మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలి.

-మాదిగ కళాకారులను విస్మరించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

-ప్రభుత్వం గుర్తించిన ప్రముఖలలో తెలంగాణ కోసం త్యాగం చేసిన నేతలను ఎందుకు విస్మరించారు?

-కళాకారులలో, ప్రముఖులలో మహిళల స్థానం ఎక్కడ ?

-కేసిఆర్ రేవంత్ రెడ్డి పెట్టిన బొమ్మలు తెలంగాణకు తల్లులు కారు…

హైదరాబాద్ డిసెంబర్ 12(ప్రజాక్షేత్ర):హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ జనవరి 27వ తేదీన హైదరాబాదులో ఎస్సీ వర్గీకరణ కోసం 1000 గొంతుకలు లక్ష డబ్బులు తో మాదిగ దండోరా ప్రదర్శనను నిర్వహిస్తాం అప్పటికే ఎస్సీ వర్గీకరణ అమలులోకి వస్తే విజయోత్సవ డప్పులు మోగిస్తాం లేకపోతే వర్గీకరణను అడ్డుకునే వాళ్లకు చావు డబ్బును మోగిస్తాం ఎస్సీ వర్గీకరణ సాధనలో అంతిమ పోరాటం మాదిగ కళాకారుల 1000 గొంతులు లక్ష డబ్బులతో జరిగే ప్రదర్శన మాదిగ కళాకారులు కవులు రచయితలే నాయకత్వం వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ కోరుకునే శక్తులను ఎస్సీ వర్గీకరణను మద్దతిచ్చే శక్తులను భాగస్వాములు చేస్తాం అన్ని వర్గాల కళాకారులను ఈ కార్యక్రమంలోకి ఆహ్వానిస్తాం. ఈ కార్యక్రమం సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న నిలువెత్తు అంబెడ్కర్ విగ్రహం ముందు నుండి వేయి గొంతులు లక్ష డప్పుల ప్రదర్శన ప్రారంభమై నెక్లెస్ రోడ్ మీదుగా బయలుదేరి సంజీవయ్య పార్క్ నుండి ట్యాంక్ బండ్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రదర్శన కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి మాదిగ కళాకారుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రథయాత్రలు మొదలవుతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 మంది కళాకారులను గుర్తించి వారికి కోటి రూపాయల బహుమతి 300 గజాల స్థలం ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఆ తొమ్మిది మంది కళాకారులో మాల సామాజిక వర్గానికి చెందిన ఐదుగురికి గుర్తించడం జరిగింది. మాదిగ కళాకారులను గుర్తించడంలో ప్రభుత్వం వివక్షత చూపెట్టింది. తొమ్మిది మంది కళాకారులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం కానీ మాదిగ కళాకారులను గుర్తించకపోవడం సరైంది కాదు తెలంగాణ ఉద్యమానికి ధూంధాం ద్వారా జీవం పోసిందే మాదిగ కళాకారులు తెలంగాణ కళాకారులు అంటేనే మాదిగలు అలాంటి మాదిగ కళాకారులను విస్మరించి తొమ్మిది మందిని ఎంపిక చేయడం అందులో మాదిగలు లేకపోవడం బాధాకరం. అందేశ్రీ మాదిగ అని కొంతమంది ప్రచారం చేస్తున్నప్పటికీ ఆయన విశ్వనరుడను, నేను మాదిగ కాదు అని చెప్పుకున్నాడు. కళాకారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం పున సమీక్ష చేసి మాదిగ కళాకారులను గుర్తించాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రముఖులలో ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం కోసం త్యాగం చేసిన ఎంతోమంది నేతలను విస్మరించింది. ముచ్చర్ల సత్యనారాయణ భూపతి కృష్ణమూర్తి లాంటి పోరాటయోధులను ప్రభుత్వం విస్మరించింది. అలాగే అమరవీరుల స్తూప రూప శిల్పి ఎక్కడ యాదగిరి రావును గుర్తించడాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఎక్కా యాదగిరి రావు గారిని తక్షణమే శాసనమండలికి ఎంపిక చేసి సరైన గౌరవం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన కళాకారుల్లో, ప్రముఖుల్లో మహిళలకు స్థానం లేకపోవడం దారుణం తెలంగాణ ఉద్యమంలో కళాకారుల్లో పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా పాటలు పాడి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు.

వారికి సరైన గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరం.

అలాగే తెలంగాణ ఉద్యమానికి ద్రోహాన్ని గురైనప్పుడు ముందుకొచ్చి తెలంగాణ పోరాటాన్ని నడిపించిన టిఎన్ సదా లక్ష్మీ ని తెలంగాణ ప్రముఖుల్లో గుర్తించకపోవడం సరైన కాదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో కేసీఆర్ పెడితే అది తనలాగే ఉందని కెసిఆర్ కూతురు కవిత ఒప్పుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి మరొక తల్లిని తీసుకురావాలని కొత్త విగ్రహం పెట్టించాడు అయితే ఆ విగ్రహం పెట్టిన రోజే ఆ తల్లిని చూస్తే చిన్నతనంలో వాళ్ళ అమ్మని చూసినట్టుగా ఉందని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పాడు కనుక తెలంగాణ తల్లి విగ్రహం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా వాళ్ళ తల్లి రూపమే ఉంది తప్ప మరొకటి కాదు. కేసీఆర్ పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాని రేవంత్ రెడ్డి పెడుతున్న విగ్రహం గానీ తెలంగాణ తల్లులుగా మేం అంగీకరించం..తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ మాత్రమే. అణగారిన వర్గాల తల్లుల జీవన విధానాలకు ప్రతిరూపంగా ఉండే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేమే స్థాపించుకుంటాం అని అన్నారు.

Related posts