ప్రభుత్వ ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను సందర్శించిన శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్
శంకర్ పల్లి డిసెంబర్ 13 (ప్రజాక్షేత్రం):మున్సిపల్ పరిధి ప్రభుత్వ ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలను శుక్రవారం శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సందర్శించారు. కమిషనర్ హాస్టల్ పరిసరాలను వంటగది, భోజనశాల, మరుగుదొడ్లు, ఆటస్థలాన్ని పరిశీలించారు. వసతి గృహంలో ఏమైనా సమస్యలున్నాయా అని విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించి రుచికరమైన భోజనాన్ని విద్యార్ధులకు అందించాలని అధికారులకు కమిషనర్ ఆదేశించారు. విద్యార్ధులు మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో రాణించాలని విద్యార్ధులకు కమిషనర్ సూచించారు కమిషనర్ వెంట మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.