Praja Kshetram
తెలంగాణ

మల్కాపూర్ చెరువులో యుద్ధ ట్యాంకరల ట్రయల్ రన్.

మల్కాపూర్ చెరువులో యుద్ధ ట్యాంకరల ట్రయల్ రన్.

 

 

కొండాపూర్ డిసెంబర్ 13(ప్రజాక్షేత్రం):భారత సౌన్యానికి ఓడిఎఫ్ తయారు చేసిన ఇన్ఫ్యాంట్రీ కాంబేడ్ వెహికల్స్ ట్రయల్ రన్ మల్కాపూర్లోని పెద్ద చెరువులో విజయవంతంగా నిర్వహించారు. శుక్రవారం కొండాపూర్ మండల పరిథిలోని మల్కాపూర్లోని పెద్దచెరువులో ఓడిఎ తయారైన బిఎంపి సెకండ్ 14టన్నుల ఇన్ ఫ్యాంట్రీ కాంబ్లేడ్ వెహికల్ ట్రయల్ రనన్ను ఓడిఎఫ్ ఛీఫ్ జనరల్ మేనేజర్ ఎస్ఎన్ ప్రసాద్ పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓడిఎఫ్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ భారత సైనికులను ఒక్కో వాహనంలో పదిమందిని బ్యాక్అఫ్ ఫీల్డ్లోకి తరలించడానికి ఉపయోగపడతాయన్నారు. సైనికులకు విపత్కర పరిస్థితుల్లో ఏదైనా గాయాలు జరిగినప్పుడు బిఎంపి సెకండ్ ఇన్ఫ్యోంట్రీ కాంబేడ్ వెహికల్స్ లో అంబులెన్స్లో న్యూక్లియర్ బయోలజికల్ కెమికల్ వెహికల్ తరలించడానికి ఉపయోగపడుతుందన్నారు. 14టన్నుల బరువు ఉన్న ఈవాహనాలు నీటిలో వడవలా స్పీడ్గా వెళ్లడం వీటి ప్రత్యేకత అన్నారు. ప్రతి సంవత్సరం 120 వాహనాలను భారత సైన్యానికి అందజేయడం జరుగుతుందన్నారు. వాహనాలకు ప్రతి సంవత్సరం 25రకాల ట్రయల్స్ చేసి వాహనాలను అప్పగించడం జరుగుతుందన్నారు. క్వాలిటీ ఆఫీసర్ రత్న ప్రసాద్ జాయింట్ జనరల్ మేనేజర్ నర్జీత్రెడ్డి, ఓడిఎఫ్ సిబ్బంది అధికారులున్నారు.

Related posts