Praja Kshetram
జాతీయం

మహాకుంభమేళాలో ఏఐ, చాట్‌బాట్‌ సేవలు : మోదీ

మహాకుంభమేళాలో ఏఐ, చాట్‌బాట్‌ సేవలు : మోదీ

 

ఉత్తర ప్రదేశ్ డిసెంబర్ 13 (ప్రజాక్షేత్రం): ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభమేళాలో తొలిసారిగా ఏఐ, చాట్‌బాట్‌ సేవలు వినియోగించుకోబోతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మహాకుంభమేళాకు సంబంధించి పలు ప్రాజెక్టులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించనున్న మహాకుంభమేళాకు ఏర్పాట్లు చేస్తున్న కార్మికులను, అధికారులను ప్రధాని అభినందించారు. ఈ ఉత్సవాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రోబోటిక్‌ ఫైర్‌ టెండర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ‘మహాకుంభామేళాతో దేశం సాంస్కృతికంగా, అధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఈవేడుకను ప్రపంచ దేశాలు చర్చించుకునే మహాయజ్ఞంగా నిర్వహిస్తాం. భారత్‌ అంటేనే పవిత్ర స్థలాలకు పుట్టినిల్లు’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Related posts