దేవర్ష్ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రు
ప్రత్తిపాడు డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం):కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన దేవర్ష్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ,వరుపుల సత్యప్రభలకి హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ అంజి నాయక్,డాక్టర్ విజయ ఘన స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ,జ్యోతుల నెహ్రులు దేవర్ష్ హాస్పిటల్ ప్రారంభించి జ్యోతి ప్రజల్వన చేసారు.ఐసీయూ,క్యాజువాలిటీ,జనరల్ వార్డు,ఆపరేషన్ థియేటర్ తదితర విభాగాలను నాయకులు చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యేలు సత్యప్రభ,నెహ్రూలు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో,ఆధునాతన పరికరాలతో ఈ ప్రాంతంలో హాస్పిటల్ నిర్మించడం సంతోష దాయకమని అన్నారు.ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యేలు యాజమాన్యానికి సూచించారు.ఈ సందర్భంగా హాస్పటల్ యాజమాన్యం డాక్టర్ విజయ,డాక్టర్ అంజి నాయక్ మాట్లాడుతూ మా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు తక్కువ ఖర్చులతో అందుబాటులో ఉంటాయని,గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా దేవర్ష్ హాస్పటల్ ప్రారంభించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు,ప్రముఖ రాజకీయ నాయకులు విచ్చేసి వారికి శుభాకాంక్షలు తెలియచేసారు.