రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న గ్రూప్-2 పరీక్ష
హైదరాబాద్ డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం):రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష ఆదివారం కొనసాగుతోంది. ఇవాళ, రేపు గ్రూప్-2 పరీక్షల నిర్వహించనున్నారు. గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అధికారులు అనుమతించలేదు. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 33 జిల్లాలో 1,368 పరీక్షా కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహిస్తున్నారు. 2022 డిసెంబరు 29 గ్రూప్2 నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్-2 లో మొత్తం నాలుగు పేపర్లు ఉంటాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేవర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకుక పేపర్-2 పరీక్ష, రేపు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-3 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్-4 పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష కేంద్రాల వద్ద 6,865 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. వేగంగా గ్రూప్-2 పరీక్షల ఫలితాలు ఇస్తామని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు.