ఫతేనగర్ నాలాలో గల్లంతైన బాలుడు మృతి
హైదరాబాద్ డిసెంబర్ 15(ప్రజాక్షేత్రం): నగరంలోని ఫతేనగర్ లో నాలాలో గల్లంతైన బాలుడు మృతి చెందాడు. సయ్యద్ ముజిమ్మిల్(8) మృతదేహం హుస్సేన్ సాగర్ లో లభ్యమైంది. నిన్న సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బాలుడు నాలాలో పడిపోయాడు. ముజిమ్మిల్ పడిన నాలా ఫతేనగర్ నుంచి బేగంపేట వైపు ప్రవహిస్తోంది. ఫతేనగర్ సమీపంలోని ఇందిరాగాంధీపురం బస్తీలో బాలుడి కుటుంబం ఉంటుంది. తమ్ముడు ఇనాంతో కలిసి ముజిమ్మిల్ ఖబ్రస్థాన్ వద్ద ఆడుకునేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడి ఆచూకీ లభించకపోవడంతో బేగంపేట పోలీస్‌స్టేషన్‌లోని అధికారులను అప్రమత్తం చేశారు. బాలుడి అంత్యక్రియలకు ఎమ్మెల్యే కృష్ణరావు రూ. 20 వేల ఆర్థిక సాయం చేశాడు.