Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

జనసేనలోకి మంచు మనోజ్, భూమా మౌనిక?

జనసేనలోకి మంచు మనోజ్, భూమా మౌనిక?

 

 

హైదరాబాద్ డిసెంబర్ 16 (ప్రజాక్షేత్రం):నటుడు మంచు మనోజ్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారాడు. మనోజ్ తన తండ్రి మోహన్ బాబు, సోదరుడు మంచు విష్ణుతో కొనసాగుతున్న వైరం విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన రాజకీయ పరిణామం అందరినీ ఆకర్షిస్తోంది. మోహన్ బాబు తనయుడు, నటుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక యాక్టివ్ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ జంట జనసేన పార్టీలో చేరి నంద్యాల నుంచి తమ రాజకీయ యాత్రను ప్రారంభించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై మంచు మనోజ్ కానీ, మౌనిక కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. రానున్న రోజుల్లో ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సోమవారం భూమా మౌనిక రెడ్డి తల్లిదండ్రులు భూమా శోభా రెడ్డి భూమా నాగిరెడ్డి జయంతి. మనోజ్ మౌనిక, మనోజ్ మౌనిక ఇద్దరూ 1000 కార్లతో ఆళ్లగడ్డకు భారీ ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జయంతి సందర్భంగా ఆళ్లగడ్డలో ప్రెస్‌మీట్‌ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. సేనలో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించబోతున్నారని వార్తలు వచ్చాయి.

Related posts