Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ

సచివాలయంలో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ

-నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు

-పోలవరం నుంచి చంద్రబాబు రాగానే వెళ్లి కలిసిన పవన్

-సచివాలయంలో దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం

అమరావతి డిసెంబర్ 16 (ప్రజాక్షేత్రం):ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సచివాలయంలో భేటీ అయ్యారు. ఇవాళ చంద్రబాబు పోలవరం పర్యటన ముగించుకుని రాగానే, ఆయనను పవన్ వెళ్లి కలిశారు. చంద్రబాబు, పవన్ మధ్య సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు సాగింది. తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవిని ఇవ్వడంపై పవన్… సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపినట్టు తెలుస్తోంది. నాగబాబు ప్రమాణస్వీకారం అంశంపైనా చర్చించినట్టు సమాచారం. అంతేకాకుండా, కూటమి పార్టీల మధ్య కిందిస్థాయి నేతల వరకు సమన్వయం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలు, మిగిలిన నామినేటెడ్ పదవులకు తుది జాబితా రూపకల్పన, ఇతర అంశాలపైనా ఇరువురు నేతలు చర్చించారు. అంతేకాదు, సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘనవిజయం అంశం కూడా చంద్రబాబు, పవన్ మధ్య చర్చకు వచ్చింది. రాబోయే సహకార సంఘాల ఎన్నికల్లో కూడా ఇదే విధంగా సమన్వయంతో ముందుకెళ్లాలని తీర్మానించారు.

Related posts