మాదారం ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీ ఎన్నిక
నవాబు పేట డిసెంబర్ 16(ప్రజాక్షేత్రం):ఎమ్మార్పీఎస్,ఎం ఎస్ పి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా సోమవారం వికారాబాద్ జిల్లా, నవాబుపేట మండలం, మాదారం గ్రామంలో వికారాబాద్ జిల్లా ఎంఎస్ పి సీనియర్ నాయకులు గుట్ట కింది రవికుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి చిట్టిగిద్ద కిష్టయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ గ్రామ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులుగా తూముకుంట ప్రకాష్ మాదిగ, అధికార ప్రతినిధి సిహెచ్ శ్రీనివాస్ మాదిగ, ఉపాధ్యక్షులుగా టి నరసింహులు మాదిగ, సిహెచ్ శ్రీశైలం మాదిగ, ప్రధాన కార్యదర్శిగా పి రుబెన్ మాదిగ, కార్యదర్శిగా ప్రకాష్ మాదిగ, టి శ్యాం కుమార్ మాదిగ, కోశాధికారిగా యాదయ్య, ప్రచార కార్యదర్శిగాఎం అనిల్ మాదిగ, సిహెచ్ నవీన్ మాదిగ, కార్యవర్గ సభ్యులుగా నరసింహులు మాదిగ, బాలయ్య మాదిగ, ఉదయ్ మాదిగ, అశోక్ మాదిగ, గౌరవ సలహాదారులుగా ఏ నరసింహులు మాదిగ, నాగేష్ మాదిగ, రాజు మాదిగ ను ఎన్నుకున్నారు.