Praja Kshetram
తెలంగాణ

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో హైదరాబాద్ ఏసిపి ప్రత్యేక పూజలు

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో హైదరాబాద్ ఏసిపి ప్రత్యేక పూజలు

 

 

శంకర్‌ పల్లి డిసెంబర్ 16 (ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో సోమవారం హైదరాబాద్ ఏసిపి విక్రమ్ దేవ్ కరుణ దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. ప్రధాన అర్చకులు ఏసీపీ దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ చైర్మన్ గోపాల్ రెడ్డి ఏసీపీని స్వామివారి శేష వస్త్రంతో సన్మానించి స్వామి వారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ధనుర్మాసం ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

Related posts