జిల్లా మత్స్య శాఖ అధికారిని కలిసిన చైర్మెన్ మహేందర్ ముదిరాజ్
-ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు భైరమోని మల్లేష్
మొయినాబాద్ డిసెంబర్ 17 (ప్రజా క్షేత్రం) : రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ అధికారిని జిల్లా మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు మహేందర్ ముదిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం నాడు ఆయన రంగారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బైరమోని మల్లేష్ ముదిరాజ్ తో కలిసి రంగారెడ్డి జిల్లా మత్స్య శాఖ అధికారి పూర్ణిమ ను తన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. వారితోపాటు వివిధ గ్రామాల మత్స్యకార సంఘాల అధ్యక్షులు మంచిరేవుల శ్రీరాములు ముదిరాజ్,కుక్కల కృష్ణ ముదిరాజ్,గుండు సురేష్ ముదిరాజ్,బైరమోని సతీష్ ముదిరాజ్ రంగారెడ్డి జిల్లా మత్స్యకారులు కావలి రమేష్ ముదిరాజ్,పూల మల్లేష్ ముదిరాజ్,అశోక్ ముదిరాజ్,శ్రీకాంత్ ముదిరాజ్ మరియు ఫిషరీస్ ఫీల్డ్ ఉద్యోగి చాకలి యాదగిరి,అంబేద్కర్,మహేందర్ తదితరులు పాల్గొన్నారు.