బీజేపీ బలోపేతానికి కృషి : రత్నం
శంకర్‌పల్లి, డిసెంబరు 18(ప్రజాక్షేత్రం):గ్రామాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తెలిపారు. బుధవారం శంకర్‌పల్లి మండల పరిధిలోని మీర్జాగూడ, ఇంద్రారెడ్డినగర్, పిల్లిగుండ్ల, దొంతన్‌పల్లి, జన్వాడ మహరాజ్ పేట తదితర గ్రామాల్లో బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీజేపీతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు మరింత శ్రమించాలన్నారు. మండలాధ్యక్షుడు రాములుగౌడ్, సీనియర్ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, సంజీవరెడ్డి, బయన్న, రాజేందర్‌సింగ్, మాజీ ఎంపీపీ బీర్ల నర్సింహ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.