ఛలో రాజ్ భవన్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఇంచార్జ్ భీమ్ భరత్
చేవెళ్ల డిసెంబర్ 18(ప్రజాక్షేత్రం):మణిపూర్ అల్లర్లు, అదానీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం బుధవారం జరిగింది. రాజ్ భవన్ దగ్గర రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీమ్ భరత్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మోదీ, అదానీకి వ్యతిరేకంగా ఫ్లకార్డులతో నినాదాలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, గౌరీ సతీష్ ఉన్నారు.