Praja Kshetram
జాతీయం

అమిత్ షా వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం

అమిత్ షా వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం

 

న్యూఢిల్లీ, డిసెంబర్ 19(ప్రజాక్షేత్రం):రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అమిత్ షాకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రూల్ 188 కింద దీనిని రాజ్యసభలో ప్రవేశపెట్టాలని నోటీసు ఇచ్చినట్లు ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ మల్లిఖార్జున్ కర్గే వెల్లడించారు. అయితే ఇదే అంశంపై అమిత్ షాకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెబ్రిక్ ఒబెరాయి బుధవారం ఇదే ప్రివిలేజ్ మోషన్ పై సభలో నోటిసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అమిత్ షా కించపరిచడంతోపాటు ప్రతిపక్షాలను తక్కువ చేసే విధంగా వ్యవహరించారని ఈ నోటీసుల్లో ఆరోపించారు. అధికార విపక్షాల పోటాపోటీ నిరసనలు.. దద్దరిల్లిన పార్లమెంట్ ఆవరణ మరోవైపు అంబేద్కర్ ను అవమానించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయడంతోపాటు ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో గురువారం అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ మకర్ ద్వార్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన బాట పట్టారు. అందుకు ప్రతిగా బీజేపీ ఎంపీలు సైతం నిరసన చేపట్టారు.దీంతో అధికార , విపక్ష పార్టీల ఎంపీలు హోరాహోరీగా నినాదాలు చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ లోకి ప్రవేశించేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నించారు. అయితే ఆయనను బీజేపీ ఎంపీలు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తాను ఎంపీనని.. పార్లమెంట్ లోకి వెళ్లే హక్కు ఉందంటూ వారికి స్పష్టం చేశారు. ఆ క్రమంలో స్వల్ప తొపులాట చోటు చేసుకొంది. దీంతో బీజేపీ ఎంపీ కింద పడిపోయినట్లు సమాచారం. దాంతో ఆయనకు గాయాలయ్యాయి. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి.. ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన ఎంపీ యోగ క్షేమాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

Related posts