ఎల్వెర్తి ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్వెటర్ల పంపిణీ
శంకర్ పల్లి డిసెంబర్ 19 (ప్రజాక్షేత్రం):శంకర్ పల్లి మండల పరిధిలోని ఎల్వెర్తి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుతున్న 38 మంది విద్యార్థిని, విద్యార్థులకు చలి నుండి రక్షణ కోసం, చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో గురువారం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జాతీయ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు శంకర్‌పల్లి ఎస్ జెడబ్ల్యూ హెచ్ఆర్ సి మున్సిపల్ చైర్మన్ గండేటి రాజేష్ గౌడ్ రాజశ్రీ దంపతులు స్వెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు శాంతి మాట్లాడుతూ సమాజ శ్రేయస్సును కోరుతూ వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సామాజిక సేవలో భాగస్వాములు కావడం హర్షణీయమన్నారు. రాజేష్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో అధిగమించి, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. మానవ హక్కుల పరిరక్షణ తమ ధ్యేయం అన్నారు. తమ జాతీయ చైర్మన్ డా. కొప్పుల విజయ్ కుమార్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో తాము కూడా భాగస్థులమై ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు పద్మ, మహేందర్, విజయలక్ష్మి, హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు ఉన్నారు.