Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

అమిత్ షా ని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి

అమిత్ షా ని మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలి

-బహిరంగ క్షమాపణ చెప్పాలి

-దళిత సంఘాల నిరసన

విశాఖపట్నం, డిసెంబర్ 19(ప్రజాక్షేత్రం):అంబేద్కర్ పట్ల అవమానకరంగా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని భరత జాతిని అవమానించిన అమిత్ షా పై రాజద్రోహం నేరం నమోదు చేసి అరెస్టు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఎల్ఐసి కూడలిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ మెమో రియల్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జే వి ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ పేరు చెప్పడం ఫ్యాషనైపోయింది దేవుడా అంటే పుణ్యమైనా వస్తుంది అంబేద్కర్ ని తలిస్తే ఏమి వస్తుందని అమిత్ షా అంబేద్కర్ పట్ల అవమాన కరంగా మాట్లాడారన్నారు.ఇది భారత జాతికి అవమానం అన్నారు.అమిత్ షా నేరస్తుడని గోద్రా సంఘటనలో ముస్లింలను ఊచ కోత కోసిన కేసులో జైలు శిక్ష అనుభవించారని తెలిపారు.
అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షులు బొడ్డు కళ్యాణరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా ను వెనకేసుకు రావడం దారుణం అన్నారు.సనాతన ధర్మం తో పరిపాలన చేస్తూన్నారుని ఆరోపించారు అమిత్ షా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఇలాంటి వారు కేంద్ర మంత్రివర్గంలో ఉండటానికి అనర్హుడు అన్నారు.అమిత్ షా క్షమాపణ చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రసాద్,శాంతారావు,జగ్జీవన రాం,చిన్న రావు దళిత హక్కుల పోరాట సమితి నుంచిఎస్రాజులు,జి.రాంబాబు,ఎంపిటిసి కె.మదు,ఏయు విద్యార్థులు లీడర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts