Praja Kshetram
తెలంగాణ

అక్రమ అరెస్టులకు బెదరం, పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తాం

అక్రమ అరెస్టులకు బెదరం, పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తాం

 

 

శంకర్ పల్లి డిసెంబర్ 19 (ప్రజాక్షేత్రం):మాలల హక్కుల అణిచివేతలపై కుట్రలను నిరసిస్తూ చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడానికి రేవంత్ సర్కార్ ముందస్తుగా గృహనిర్బంధాలు చేసి, పోలీస్ స్టేషన్లకు తరలించ డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాల, మాల అనుబంధ కులాల హక్కుల పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బండారి బాలకిషన్ అన్నారు దళితుల మధ్యన చిచ్చుపెట్టి, ఎస్సి రిజర్వేషన్లు ను పూర్తిగా తొలగించే కుట్ర జరుగుతుందని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ మరియు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేసి ఎస్సీల అభివృద్ధికి కృషి చేయాలని, ఎస్సీల జనాభా దామాషా ప్రకారం 25 శాతం ఇంకా రిజర్వేషన్లు పెంచాలని ఈడబ్ల్యూఎస్ కోటాను కేవలం ఉన్నత వర్గాల వారికే పరిమితం చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల వారికి కూడా ఈడబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. అంబేద్కర్ వాదులుగా, రాజ్యాంగ పరిరక్షకులుగా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలను పసిగట్టి పోరాటాలు చేస్తున్న క్రమంలో ప్రభుత్వాలు దళితులందరి హక్కులను నిర్వీర్యం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ అరెస్టులకు మేము అదిరేది బెదిరేది అస్సలు లేదు, మా పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసి మాలల హక్కులు, దళితుల హక్కులు మరియు రాజ్యాంగ పరిరక్షణ కోసం వెనకడుగు వేయమని ఏ పోరాటానికైన సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేశారు. శంకర్ పల్లి పోలీసులు అరెస్టు చేసిన వారిలో మల్లె పూల శంకరయ్య, మాల వికాస్, మాల నర్సింలు, ఎల్లకొండ వెంకటేష్, బి రాములు తదితరులు ఉన్నారు.

Related posts