పోలీసులను మర్యాదపూర్వకంగా కలిసిన యూత్
-చేవెళ్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కుపల్లి మహిపాల్
శంకర్ పల్లి డిసెంబర్ 19(ప్రజాక్షేత్రం):చేవెళ్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోత్కుపల్లి మహిపాల్ మోకిల పోలీస్ స్టేషన్ కి నూతనంగా వచ్చిన డిటెక్టివ్ సీఐ సమరంను మర్యాదపూర్వకంగా కలిశారు. తదుపరి డీఐ సమరం, ఎస్ఐ కోటేశ్వర్ రావులను శాలువాతో సత్కరించారు. మహిపాల్ మాట్లాడుతూ.. పోలీసులు రాత్రింబవళ్లు శ్రమించి ప్రజలకోసం పని చేస్తున్నారని అన్నారు. మోకిల గ్రామ పంచాయతీ చెందిన ట్రాక్టర్ దొంగలు ఎత్తుకెళ్లిన విషయం లో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ట్రాక్టర్ మహారాష్ట్ర లో ఉంది అని గుర్తించి తీసుకొచ్చిన ఘనత మోకిల పోలీస్ సిబ్బంది కి దక్కింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాశీనాథ్ గౌడ్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మహిపాల్, భీష్మ, చిన్న, చందు పాల్గొన్నారు.