ఆందోళన చేసే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి: అక్బరుద్దీన్
హైదరాబాద్, డిసెంబర్ 20(ప్రజాక్షేత్రం): తెలంగాణ శాసన సభలో భూ భారతి చట్టంపై చర్చ జరుగుంతోంది. గతేడాది హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ-రేసింగ్ అంశంపై శాసనసభలో చర్చించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ అంగీకరించకపోవడంతో సభలో కొతసేపు ఆందోళన చేసి స్పీకర్ పోడియం వైపు దూసుకేళ్లారు.దీంతో కాసేసు గందరగోళం వాతావరణం ఏర్పాడింది. బీఆర్ఎస్ సభ్యుల తీరును ఎంఐఎం అక్బరుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. సభను ఆర్డర్ లో పెట్టాలని, ఆందోళన చేసే సభ్యులను సస్పెండ్ చేయాలని అక్బరుద్దీన్ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. ధరణి వల్ల వేల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని, అందులో ఉన్న లోపాలను త్వరగా సరిచేసి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరణి అవకతవకలపై కోదండరామ్ కమిటీ రిపోర్టును ప్రభుత్వం బయటపెట్టాలని అక్బరుద్దీన్ పేర్కొన్నారు.