Praja Kshetram
తెలంగాణ

డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

 

శంకర్‌ పల్లి డిసెంబర్ 20 (ప్రజాక్షేత్రం):శంకర్‌ పల్లి మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్ ను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు పలు అంశాలపై విజ్ఞప్తి చేశారు. చెత్తను తడి పొడిగా వేరు చేయాలని, చెత్తను ప్లాస్టిక్ డ్రైనేజీల్లో, నాళాలలో వేయకూడదని, బహిరంగ ప్రదేశాలలో, రోడ్లపై ఖాలీ ప్రదేశాలలో చెత్త వేయరాదు. చెత్తను మున్సిపల్ వాహనాలకు మాత్రమే ఇవ్వగలరని కోరారు. ప్రజా మరుగుదొడ్లను వాడండి. పట్టణ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించబడింది. ప్లాస్టిక్ బదులుగా జూట్, క్లాత్ బ్యాగులను మాత్రమే వాడండని కమిషనర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts