Praja Kshetram
తెలంగాణ

పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే : శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే : శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్

 

శంకర్‌ పల్లి డిసెంబర్ 21(ప్రజాక్షేత్రం):ఇందిరమ్మ ఇండ్ల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని శంకర్‌ పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణ పరిధి 2,15 వార్డులలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ సర్వేయర్లు ఇంటింటికీ తిరుగుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న అర్జీదారుల వివరాలను సేకరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ, పొరపా ట్లకు తావులేకుండా దరఖాస్తుదారుల వివరాలను ఆన్లైన్ మొబైల్ యాప్ లో జాగ్రత్తగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ నెలాఖరులోగా ప్రణాళికాబద్ధంగా సర్వే పూర్తి చేయాలని అన్నారు. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం ప్రాధాన్యత క్రమంలో నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయ నుందన్నారు. మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts