Praja Kshetram
తెలంగాణ

సిల్వర్ డెల్ స్కూల్ వరుస బస్సు ప్రమాదాలపై చేవెళ్ల ఆర్డిఓ కి, ఎంఈఓ కి ఫిర్యాదు చేసిన ఎస్ఎఫ్ఐ

సిల్వర్ డెల్ స్కూల్ వరుస బస్సు ప్రమాదాలపై చేవెళ్ల ఆర్డిఓ కి, ఎంఈఓ కి ఫిర్యాదు చేసిన ఎస్ఎఫ్ఐ

-స్కూల్ గుర్తింపు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

-ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎర్రవల్లి శ్రీనివాస్ బేగరీ అరుణ్ కుమార్

చేవెళ్ల డిసెంబర్ 21(ప్రజాక్షేత్రం): శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలోని సిల్వర్ డేల్ స్కూల్ కు చెందిన బస్సు శుక్రవారం చనువల్లి గ్రామంలో ప్రమాదానికి గురైంది సిల్వర్ డెల్ స్కూల్ వరుస బస్సు ప్రమాదాలపై చేవెళ్ల ఆర్డిఓ మేడంకి, చేవెళ్ల ఎంఈఓ కి ఫిర్యాదు చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా పాఠశాలలో శిక్షణ పొందిన డ్రైవర్లు లేకపోవడం వారిలో కొంతమంది లైసెన్సులు లేకపోవడం వల్లనే వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్ఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే సంబంధిత అధికారులు స్కూల్ విజిట్ చేసి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ గుర్తింపు లేకపోయినప్పటికీ ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో వేల రూపాయల ఫీజులు దండుకుంటూ విద్యార్థుల సంక్షేమంపై దృష్టి లేకపోవడం సరైంది కాదన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు తేజ తదితరులు పాల్గొన్నారు.

Related posts