మంత్రి వర్గంలో మాదిగలకు అవకాశం కల్పించాలి
-కోళ్ళ శివ మాదిగ జాతీయ ప్రధాన కార్యదర్శి
జాహీరాబాద్ డిసెంబర్ 21(ప్రజాక్షేత్రం):అబ్రహం మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జహీరాబాద్ నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశం కు ముఖ్య అతిథి గా విచ్చేసిన కోళ్ళ శివ మాదిగ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మాట్లాడుతూ…. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మాదిగలకు అదనంగా రెండు మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ అనుకూల తీర్పును అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఈ నిర్లక్ష్యాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వర్గీకరణ చేయకపోవడం వలన మాదిగ మాదిగ ఉపకులాలు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో తీవ్రంగా నష్టపోతున్నాయని ఈ విషయం ప్రభుత్వానికి తెలిసిన నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉండడాన్ని ఆక్షేపిస్తున్నాం వర్గీకరణ వ్యతిరేకులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం అండదండలు అందిస్తూ వర్గీకరణ జరగకుండా కాలయాపన చేయడానికి పూనుకోవడాన్ని మానుకోవాలని హెచ్చరిస్తున్నాం వచ్చే సంవత్సరం జనవరి 27 లోపు ఎస్సీ వర్గీకరణ మీద ప్రభుత్వం అనుకూల నిర్ణయం తీసుకోకపోతే 1000 గొంతులు లక్ష డప్పులతో ట్యాంకుబండు మీద మాదిగల కవార్డు నిర్వహిస్తామని అంతలోపు వర్గీకరణ అమలు చేస్తే ఆ డబ్బులు ప్రభుత్వానికి కృతజ్ఞతతో ఉంటాయని వర్గీకరణ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అట్లాగే వర్గీకరణ వ్యతిరేకులకు అది చావు డబ్బుగా మారుతుందని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో….బుచ్చేంద్ర జిల్లా అధ్యక్షులు, పెద్ద గీత మాదిగ రాష్ట్ర మహిళా నాయకురాలు, కవిత మాదిగ మహిళా అధ్యక్షులు, పల్లవి మహాజన జిల్లా అధ్యక్షులు మహాజన సోషలిస్ట్ పార్టీ, ఉల్లాస్, రవికుమార్, మహేష్, మైకల్, జైరాజ్, బబ్లు, మనోజ్, చింటు, సంజీవ్, సుదీష్, సుకుమార్, స్వరాజ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.