Praja Kshetram
తెలంగాణ

అంగట్లో ప్రజలకు, వ్యాపారస్తులకు సెల్ ఫోన్ నేరాల పట్ల అవగాహన సదస్సు

అంగట్లో ప్రజలకు, వ్యాపారస్తులకు సెల్ ఫోన్ నేరాల పట్ల అవగాహన సదస్సు

 

మోమిన్ పేట డిసెంబర్ 21(ప్రజాక్షేత్రం):అంగడి పాత బస్టాండు వద్ద మోమిన్ పేట పోలీస్ సిబ్బంది సూచనలు ఇవ్వనైనది…..అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పుండరీకము మాట్లాడుతూ అంగడి లో కూరగాయలు కొనే సమయంలో, కూరగాయలు అమ్మే సమయంలో సెల్ ఫోన్లు దొంగతనం జరుగుతుంటాయి సెల్ ఫోన్లు ఎప్పుడైనా షర్ట్ జేబులో పైకి కనిపించేటట్లుగా పెట్టుకోరాదు చిల్లర డబ్బులే పెట్టుకోవాలి. సమాజంలో పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల, ఆర్థిక నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించినారు. ఒకవేళ మీరు గాని మీ బంధువులు వ్యాపారస్తులు గాని సైబర్ నేరాల లో డబ్బులు కోల్పోయినచో ఎక్కడ ఉన్నా కూడా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ (1930 ) కు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలపాలని సూచించినారు. మరియు ఎవరైనా బైక్ కొనాలి అనుకున్నా? కారు కొనాలి అనుకున్నా ఫోను లో చూసి కొనవద్దు. మెకానికల్ షాప్ కి వెళ్లి వాహనాలను కొనుగోలు చేయాలి. అంతేకానీ ఆన్లైన్లో కార్లు బైకులు కొంటే మోసాలకు గురి అవుతారు. ఎవరైనా వచ్చి అపరిచిత వ్యక్తులు +923230268518 ఈ సిరీస్ నా ఫోన్ నెంబర్ నుండి వాట్సప్ కాల్ పోలీస్ డిపి కాల్స్ వస్తే ఫోన్ మాట్లాడవద్దని సూచించినారు మరియు అపరిచిత వ్యక్తులకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా డబ్బులు పంప వద్దని మోసపూరిత మాటలు నమ్మి డబ్బులు వేయవద్దు అని సూచించినారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వ్యాపారస్తుల వద్దకు వచ్చి మా బంధువులు ఆసుపత్రిలో ఉన్నారని మా వద్ద ఆన్లైన్లో డబ్బులు ఉన్నాయని మాకు నగదు ఇవ్వమని మోసపూరిత మాటలు చెప్పి, ఫోన్ పే ద్వారా డబ్బులు వేసినట్లుగా చూయించి నగదు డబ్బు తీసుకొని పోరారు అయితారు మీ ఫోన్లలో డబ్బులు జమ కావు. అందువల్ల ఇలాంటి మోసాలు నమ్మి మీరు మోసపోవద్దు అని సూచించినారు. మరియు మేకల వ్యాపారుల వద్దకు మేకలు కొనుగోలు చేస్తామని బేరం ఆడి మేకల వ్యాపారులకు ఫోన్ పే లో లో డబ్బులు వేసినట్లుగా చూయించి మేకలను తీసుకెళ్తారు, ఆ తరువాత సంబంధిత మేకల్ వ్యాపారుల వద్ద డబ్బులు జమ కావు. ఇలాంటి మోసాలు అంగడిలో చాలా జరుగు తున్నాయి. కావున వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి అన్ని సూచించినారు. ఈ కార్యక్రమంలో శిక్షణా మహిళా ఎస్సై శ్రీమతి మీనాక్షి గారు, మోమిన్‌పేట పోలీసు హెడ్ కానిస్టేబుల్ దత్తాత్రి, కానిస్టేబుల్స్ శ్రీశైలం, శ్రీనివాస్ పాల్గోన్నారు.

Related posts