శ్రీ కేతకి లేడీస్ ఎంపోరియమ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి రాజు
సదాశివపేట డిసెంబర్ 22( ప్రజాక్షేత్రం):సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలోని, 10వ వార్డు నందు బగిలి శ్వేత- విష్ణు వర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కేతకి లేడీస్ ఎంపోరియంను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు ప్రారంభించారు. ఇట్టి సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ నేటికాలంలో నిత్యం పెరిగే ఖర్చులకు గాను భర్తకు చేదోడు వాదోడుగా భార్య కూడా సంపాదిస్తే కుటుంబం మీద భారం పడకుండా ఉంటుందని ఈ సందర్భంగా పులిమామిడి రాజు అన్నారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సాతాని శ్రీశైలం, బామిని రవి కుమార్, నర్సింలు గోల్డ్ స్మిత్, ప్రతాప్ రెడ్డి, తాలెల్మ రాము, సోమ శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు.