Praja Kshetram
తెలంగాణ

బిజెపి బూత్ కమిటీ అధ్యక్షులుగా శివ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి

బిజెపి బూత్ కమిటీ అధ్యక్షులుగా శివ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి

 

మొయినాబాద్ డిసెంబర్ 22(ప్రజాక్షేత్రం):బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీరాంనగర్ గ్రామంలో బిజెపి గ్రామస్థాయి నూతన బూత్ కమిటీ కార్యవర్గమును ఎన్నుకున్నారు. 164 బూత్ కమిటీ అధ్యక్షులుగా రేనట్ల శివ గౌడు,165 బూత్ కమిటీ అధ్యక్షులుగా పటేల్ శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి బూత్ కమిటీలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు గడపగడపకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ఓటర్లకు వివరించి లబ్ధిదారులకు అందేలా చూడాలని అన్నారు. బూత్ ఇంచార్జ్ సుధింద్ర మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం సాధించిన విజయాలను ఓటర్లకు వివరించాలని అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా చూడాల్సిన బాధ్యత బూత్ అధ్యక్షులది అని అన్నారు. నూతన బూత్ అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భూత్ ఇంచార్జ్ చిలుకూరి సుధీంద్ర, బీజేవైఎం ప్రశాంత్, గ్రామ మాజీ ఉపసర్పంచులు శిరీష శివశంకర్, మాడి మాధవరెడ్డి, మాజీ వార్డు సభ్యులు వడ్డే యాదయ్య,మెయిన్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, గ్రామస్థాయి బిజెపి కార్యకర్తలు,నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts